జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి సొంతూరులో కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థి ఓటమి ఆయన అహంకారానికి ప్రజలు ఓటు ద్వారా చేసిన హెచ్చరిక అని మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ అన్నారు. శుక్రవారం రంగారెడ్డిగూడెంలో బీజేపీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి ఆనంద్ రేవతిని ఎంపీ అభినందించి, శాలువాతో సన్మానించారు. గ్రామాభివృద్ధికి భవిష్యత్తులో మరింత కృషి చేయాలని సూచిస్తూ, తన పూర్తి సహకారం ఉంటుందని అరుణ హామీ ఇచ్చారు.