మహబూబ్ నగర్ జిల్లా అధికారులు ప్రతి నెల మొదటి వారంలో తమకు కేటాయించిన సంక్షేమ వసతి గృహాలు, గురుకుల పాఠశాలలు, కేజీబీవీలను తప్పనిసరిగా తనిఖీ చేయాలని కలెక్టర్ విజయేందిర బోయి ఆదేశించారు. తనిఖీ వివరాలను 'విద్యా ఐ' యాప్లో అప్లోడ్ చేయాలని సూచించారు. కలెక్టరేట్లో అధికారులతో సోమవారం నిర్వహించిన సమీక్షలో, నిర్లక్ష్యం వహించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు.