మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ మాట్లాడుతూ, సంస్థానాలను ఏకం చేసి, సుస్థిర భారతదేశానికి బాటలు వేసిన మహోన్నత శిఖరాగ్రం సర్దార్ వల్లభాయ్ పటేల్ అని అన్నారు. పటేల్ 150వ జయంతిని పురస్కరించుకొని జిల్లా పార్టీ కార్యాలయంలో పటేల్ చిత్రపటానికి ఆమె పూలమాల వేసి నివాళులర్పించారు. సర్దార్ పటేల్ ను స్ఫూర్తిగా తీసుకొని దేశ ఐక్యత, భద్రత కోసం యువత ముందుకు నడవాలని డీకే అరుణ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, ఎస్పీ తదితరులు పాల్గొన్నారు.