డి ఫెన్స్‌ కారిడార్‌ ఏర్పాటు చేయాలి

1చూసినవారు
డి ఫెన్స్‌ కారిడార్‌ ఏర్పాటు చేయాలి
తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి, మాజీ ఎంపీ ఏపీ జితేందర్‌రెడ్డి, నాగర్‌కర్నూల్‌ ఎంపీ డాక్టర్‌ మల్లురవితో కలిసి బుధవారం న్యూఢిల్లీలో కేంద్ర రక్షణశాఖ కార్యదర్శి రాజేశ్‌కుమార్‌ సింగ్‌ను కలిశారు. హైదరాబాద్‌-బెంగళూరు మధ్య డిఫెన్స్‌ కారిడార్‌ ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. ఈ కారిడార్‌ దేశ రక్షణ ప్రగతికి, ఆత్మనిర్భర భారత్‌ లక్ష్య సాధనకు, భారీ పెట్టుబడుల ఆకర్షణకు దోహదపడుతుందని తెలిపారు. హైదరాబాద్‌లోని డిఫెన్స్‌ హబ్‌లను, బెంగళూరులోని ఎరోస్పేస్‌ యూనిట్లను కలుపుతూ సమగ్ర పారిశ్రామిక జోన్‌గా అభివృద్ధి చెందుతుందని వివరించారు. మహబూబ్‌నగర్‌ జిల్లా దేవరకద్ర మండలంలో రక్షణ పరిశోధన సంస్థ నిర్మించ తలపెట్టిన బ్రహ్మోస్‌ క్షిపణి తయారీ కాంప్లెక్స్‌ పనులు త్వరగా పూర్తి చేయాలని కూడా విజ్ఞప్తి చేశారు.

సంబంధిత పోస్ట్