జేపీఎన్సీఈలో ఏఐతో విద్యార్థుల అద్భుత ఆవిష్కరణలు

2చూసినవారు
జేపీఎన్సీఈలో ఏఐతో విద్యార్థుల అద్భుత ఆవిష్కరణలు
మహబూబ్‌నగర్ జిల్లా, మహబూబ్ నగర్ నియోజకవర్గంలోని జయ ప్రకాష్ నారాయణ కాలేజీ ఆఫ్ ఇంజనీరింగ్లో,   సిఎస్సీ విభాగం ఆధ్వర్యంలో “Prompt it – Brand it – Launch it” నినాదంతో గూగుల్ స్టూడెంట్ అంబాసిడర్ కార్యక్రమం శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సుమారు 100 మంది విద్యార్థులు ఏఐ సహాయంతో వినూత్న ఉత్పత్తులను రూపొందించారు. విద్యార్థులు రూపొందించిన Ear Bud & Jhumka కు ప్రథమ బహుమతి లభించింది. కళాశాల చైర్మన్ కేఎస్ రవి కుమార్ విద్యార్థులను అభినందించి, ఏఐను సృజనాత్మకంగా వినియోగించి ఆవిష్కరణలు చేయాలని సూచించారు. ప్రిన్సిపల్ కృష్ణ మూర్తి, సిఎస్సీ విభాగాధిపతి రాకేష్, అధ్యాపకులు జమున తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్