SV చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో విద్యార్థులకు అవగాహన కార్యక్రమం

674చూసినవారు
SV చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో విద్యార్థులకు అవగాహన కార్యక్రమం
మహబూబ్‌నగర్‌లోని ఎస్వీ ఇన్ఫో టెక్నాలజీస్‌లో ఎస్వీ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో శుక్రవారం డీపీ‌వీ ఇంటిగ్రేటెడ్ స్టూడెంట్ అవేర్‌నెస్ ప్రోగ్రామ్ నిర్వహించారు. డిజిటల్ విద్య, ప్రాక్టికల్ డిజిటల్ నైపుణ్యాలు, అవయవదానం, పర్యావరణ పరిరక్షణపై విద్యార్థులకు అవగాహన కల్పించడం కార్యక్రమం ప్రధాన ఉద్దేశంగా నిర్వాహకులు తెలిపారు.ఈ సందర్భంగా డిపికా (డిజిటల్ ఎడ్యుకేషన్ అండ్ ప్రాక్టికల్ డిజిటల్ స్కిల్స్), ప్రాణద (ఆర్గాన్ డొనేషన్ అవేర్‌నెస్), వసుధ (ఎన్విరాన్‌మెంటల్ అవేర్‌నెస్ అండ్ సస్టైనబిలిటీ) అంశాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో పాల్గొన్న వారికి సర్టిఫికెట్లు అందజేశారు.

సంబంధిత పోస్ట్