బస్సు – బైక్ ఢీ.. యువకుడు మృతి

3చూసినవారు
బస్సు – బైక్ ఢీ.. యువకుడు మృతి
గండీడ్ మండలం కొంరెడ్డిపల్లి గ్రామ శివారులో శుక్రవారం విషాదకర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బస్సు - బైక్ ఢీకొన్న ఘటనలో బైక్‌పై ప్రయాణిస్తున్న ఓ యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికుల వివరాల ప్రకారం దేశాయిపల్లి గ్రామానికి చెందిన కుర్వ మల్లేష్ (తండ్రి కుర్వ కిష్టయ్య), 27, బైక్‌పై దేశాయిపల్లి నుంచి కోస్గి వైపు వెళ్తుండగా కొంరెడ్డిపల్లి గ్రామ శివారులో ఎదురుగా వచ్చిన ఆర్టీసీ బస్సు ఢీకొంది. ప్రమాద తీవ్రతకు మల్లేష్ బస్సు కింద పడిపోవడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.

సంబంధిత పోస్ట్