నవజాత శిశువును పీక్కుతిన్న కుక్కలు

11చూసినవారు
నవజాత శిశువును పీక్కుతిన్న కుక్కలు
మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలో మానవత్వం మంటగలిసిన ఘటన చోటు చేసుకుంది. హౌసింగ్ బోర్డు కాలనీ సమీపంలోని గుట్ట పక్కన గుర్తు తెలియని వ్యక్తులు అప్పుడే పుట్టిన నవజాత శిశువును పడేసి వెళ్లారు. వీధి కుక్కలు ఆ శిశువు శరీర భాగాలను కొరికి తినేశాయి. స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని శిశువును తరలించి, ఈ ఘటనపై విచారణ చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.