థానేలో డ్రగ్ రాకెట్ గుట్టు రట్టు.. మహబూబ్ నగర్ వాసి అరెస్ట్

5చూసినవారు
థానేలో డ్రగ్ రాకెట్ గుట్టు రట్టు.. మహబూబ్ నగర్ వాసి అరెస్ట్
థానేలో ఒక భారీ డ్రగ్ రాకెట్ గుట్టు రట్టయింది. ముంబై-నాసిక్ హైవేపై ఖరేగావ్ టోల్ వద్ద 638 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ సుమారు రూ.2.04 కోట్లుగా అంచనా వేయబడింది. ఈ డ్రగ్స్ ను ఒడిశా, తెలంగాణ నుంచి ముంబైకి రవాణా చేస్తున్నట్లుగా గుర్తించిన తెలంగాణలోని మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన చిన్న ఠాగూర్ లక్ష్మణ్ నాయక్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. అతనిపై NDPS చట్టం కింద కేసు నమోదు చేశారు.

సంబంధిత పోస్ట్