మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని గ్రామర్ హైస్కూల్‌లో బుధవారం నుంచి పదో తరగతి జవాబు పత్రాల మూల్యాంకనం ప్రారంభం కానుంది. ఈనెల 9 వరకు ప్రధాన సబ్జెక్టులు, 10 నుంచి 17 వరకు సైన్స్, 18 నుంచి 23 వరకు సాంఘిక శాస్త్రం పేపర్లు దిద్దనున్నారు. తొలి విడతలో 2.10 లక్షల పత్రాల పరిశీలనకు అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు.