తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగ యువతకు తీపి కబురు అందించింది. మే 1న మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో భారీ జాబ్ మేళాను నిర్వహించనుంది. ఈ మేళాలో సుమారు 250 కంపెనీలు పాల్గొని, కస్టమర్ సర్వీస్, ఐటీ, బ్యాంకింగ్, హెల్త్ కేర్ వంటి వివిధ రంగాలలో ఉపాధి అవకాశాలు కల్పించనున్నాయి. ఇంటర్, డిగ్రీ, డిప్లోమా, పీజీ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ మేళాలో పాల్గొనడానికి అర్హులు. ఆసక్తిగల అభ్యర్థులు <> పోర్టల్‌లో తమ పేర్లను నమోదు చేసుకోవాలని సూచించారు.