స్మార్ట్ ఇండియా హ్యాకథాన్‌లో విద్యార్థుల వినూత్న ఆవిష్కరణలు

604చూసినవారు
స్మార్ట్ ఇండియా హ్యాకథాన్‌లో విద్యార్థుల వినూత్న ఆవిష్కరణలు
మహబూబ్‌నగర్ జిల్లాలోని జయప్రకాశ్ నారాయణ ఇంజినీరింగ్ కళాశాలలో శుక్రవారం స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ 2026 రెండో రోజు ఉత్సాహంగా కొనసాగింది. ఈ కార్యక్రమంలో సుమారు 300 మంది విద్యార్థులు ఆరోగ్యం, వ్యవసాయం, ఏఐ, అంతరిక్ష సాంకేతికత, సుస్థిర అభివృద్ధి వంటి రంగాల్లో వినూత్న పరిష్కారాలను ప్రదర్శించారు. కళాశాల చైర్మన్ కేఎస్ రవి కుమార్ విద్యార్థులను అభినందిస్తూ, సమాజానికి ఉపయోగపడే ఆచరణాత్మక పరిష్కారాలను అభివృద్ధి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ కృష్ణ మూర్తి, విభాగాధిపతులు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్