కల్వకుర్తి నియోజక వర్గం తలకొండపల్లి మండలం వెల్టాల పంచాయతీ సెక్రెటరీ ఎం. శరత్ కుమార్ మంగళవారం ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. ఒక వ్యక్తి ప్లాట్ పేరు మార్పిడి కోసం రూ. 30 వేలు డిమాండ్ చేయగా, రూ. 20 వేలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు అతన్ని పట్టుకున్నారు. రంగారెడ్డి ఏసీబీ డీఎస్పీ ఏపీ. ఆనంద్ కుమార్ ఈ వివరాలను వెల్లడించారు. ప్రస్తుతం సెక్రెటరీని అధికారులు విచారిస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది