మహబూబ్‌నగర్: అమరులను విస్మరించొద్దు: పసుల రాజు

5చూసినవారు
మలిదశ తెలంగాణ ఉద్యమంలో అమరులైన వారిని రాష్ట్ర ప్రభుత్వం విస్మరించడం సరికాదని ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం అధ్యక్షుడు పసుల రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో శ్రీకాంతాచారి వర్ధంతి సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఉద్యమకారుల జయంతి, వర్ధంతి వేడుకలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించకపోవడం శోచనీయమని విమర్శించారు. ప్రభుత్వం అమరుల త్యాగాలను గుర్తించాలని ఆయన డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్