అత్యాశకు పోయి ప్రభుత్వ ఉద్యోగం కోల్పోయిన ఓ స్కూల్ పీఈటీ (PET) ఉదంతం జిల్లాలో చర్చనీయాంశమైంది. రాంనగర్లోని బాలికల హైస్కూల్లో పీఈటీగా పనిచేస్తున్న పుష్ప, ఇటీవల జరిగిన మద్యం టెండర్లలో పాల్గొని లక్కీడిప్లో ధర్మాపూర్ వైన్ షాపును దక్కించుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగి అయి ఉండి టెండర్లలో పాల్గొనడంపై అధికారులు సీరియస్ గా తీసుకున్నారు. విచారణ అనంతరం డీఈఓ ప్రవీణ్ కుమార్ ఆమెను సస్పెండ్ చేశారు.