గిన్నిస్ రికార్డు సాధించిన పాలమూరు మహిళ

0చూసినవారు
గిన్నిస్ రికార్డు సాధించిన పాలమూరు మహిళ
మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన గృహిణి చైతన్య, గంట పాటు ఆగకుండా పియానో కీబోర్డు వాయించి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో స్థానం సంపాదించారు. ఫిబ్రవరి 2న హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో 22 దేశాలకు చెందిన 2 వేల మంది విద్యార్థులతో కలిసి ఆమె పియానో వాయించారు. ఈ కార్యక్రమంలో 777 మంది అర్హత సాధించగా, చైతన్య కూడా వారిలో ఒకరు. మే 29న హైదరాబాద్‌లోని విక్టరీ ఆడిటోరియంలో ఆమెకు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు ధ్రువపత్రం, ప్రశంసాపత్రం అందజేశారు. ఇది తనకు దక్కిన గొప్ప అవకాశమని, 2014లో కూడా 400 మందితో కలిసి రికార్డు సృష్టించానని చైతన్య తెలిపారు.
Job Suitcase

Jobs near you