బీజేపీ నాయకుల ముందస్తు అరెస్ట్

559చూసినవారు
బీజేపీ నాయకుల ముందస్తు అరెస్ట్
మహ్మదాబాద్ మండలంలో రైతుల కోసం 24 గంటల నాణ్యమైన విద్యుత్ అందించాలని చేపట్టిన ధర్నాకు ముందు, బీజేపీ నాయకులను ముందు జాగ్రత్త చర్యగా పోలీసులు అరెస్ట్ చేశారు. రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర రావు ఆదేశాల మేరకు జూరాల ప్రాజెక్టు సందర్శనకు వెళ్తున్న మహ్మదాబాద్ మండల బీజేపీ నాయకులను అరెస్ట్ చేయడం సరికాదని పార్టీ నాయకులు పేర్కొన్నారు. మండల అధ్యక్షులు ముస నర్సింహా, జిల్లా కౌన్సిల్ మెంబర్ కుర్వ కృష్ణ, ప్రధాన కార్యదర్శి కాశీనాధ్, మాజీ బీజేవైఎం అధ్యక్షులు శ్రీనివాసులు, ఉపాధ్యక్షులు పుట్ట పాటి ఆంజనేయులు తదితరులను అరెస్ట్ చేశారు.

సంబంధిత పోస్ట్