SV ఛారిటబుల్ ట్రస్ట్‌లో రాధిక, రేవతికి నూతన బాధ్యతలు

0చూసినవారు
SV ఛారిటబుల్ ట్రస్ట్‌లో రాధిక, రేవతికి నూతన బాధ్యతలు
మహబూబ్‌నగర్ జిల్లాలో, SV ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సంస్థ కార్యకలాపాల నిర్వహణకు నూతన బాధ్యతలు చేపట్టిన ఎగ్జిక్యూటివ్ కమ్ మేనేజర్ సి. రాధిక మరియు ఎగ్జిక్యూటివ్ కమ్ అసిస్టెంట్ మేనేజర్ కె. రేవతిలకు శుక్రవారం నియామక పత్రాలను అందజేశారు. ట్రస్ట్ ఫౌండర్ & మేనేజింగ్ ట్రస్టీ అరువ రామతేజ చేతుల మీదుగా వీరు నియామక పత్రాలు అందుకున్నారు. ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న విద్య, డిజిటల్ అవగాహన, విద్యార్థుల అభివృద్ధి, సామాజిక అవగాహన కార్యక్రమాల నిర్వహణలో వీరు తమ బాధ్యతలను నిర్వర్తించనున్నారు.

సంబంధిత పోస్ట్