వనపర్తి జిల్లా గోపాల్‌పేట మండలంలోని 15 గ్రామ పంచాయతీల్లో సర్పంచ్ ఎన్నికలు బుధవారం ప్రశాంతంగా ముగిశాయి. తాడిపర్తి గ్రామ సర్పంచ్‌గా కాంగ్రెస్ బలపరిచిన మద్దతుదారు పెరి లోకారెడ్డి, సమీప ప్రత్యర్థి గణేష్ గౌడ్‌పై 435 ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించారు. మొత్తం 12 వార్డు స్థానాలకు గాను 7 వార్డు సభ్యులను గ్రామస్థులు ఎన్నుకున్నారు.