పక్షవాతంతో బాధపడుతున్న పీఈటీకి ఉపాధ్యాయుల చేయూత

4చూసినవారు
పక్షవాతంతో బాధపడుతున్న పీఈటీకి ఉపాధ్యాయుల చేయూత
చింతకుంట మండల పరిధిలోని పూర్ గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక ఉన్నత పాఠశాలలో కాంట్రాక్ట్ పద్ధతిలో పీఈటీగా పనిచేస్తున్న పి. రాజుకు పక్షవాతం రావడంతో కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో పడింది. సరైన వైద్యం అందక కష్టాలు పడుతున్న అతడి కుటుంబాన్ని ఆదుకోవాలని మండల విద్యాధికారి పి. మురళీకృష్ణ సంకల్పించడంతో, వివిధ పాఠశాలలకు చెందిన ఉపాధ్యాయులు లక్ష రూపాయలు ఆర్థిక సహాయం అందించి మానవత్వాన్ని చాటుకున్నారు.