తెలంగాణ ఉద్యమకారుడు పోలీస్ కృష్ణన్న వర్ధంతి సందర్భంగా తెలంగాణ ముదిరాజ్ మహాసభ ఆధ్వర్యంలో పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించి, ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా బెక్కం జనార్దన్, డిసిసి ప్రెసిడెంట్ సంజీవ్ ముదిరాజ్ మాట్లాడుతూ, తెలంగాణ ఉద్యమంలో పోలీస్ కృష్ణ త్యాగం మరువలేనిదని కొనియాడారు. తెలంగాణ అమరవీరుల త్యాగాల ఫలితంగానే తెలంగాణ సిద్ధించిందని, పోలీస్ కిష్టన్న బలిదానం తెలంగాణ ఉద్యమంలో మలుపు తిప్పిందని, ఆయన త్యాగం గొప్పదని తెలంగాణ ఉద్యమకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పసలరాజు, తెలంగాణ ముదిరాజ్ మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పెద్ద విజయకుమార్ ముదిరాజ్ కీర్తించారు.