
మహబూబ్ నగర్: కాలిన గాయాలతో పంట పొలాలలో యువతి
మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్ మండలం నర్సింగాపూర్ గ్రామ శివారులోని పంట పొలాల్లో శనివారం ఓ యువతి కాలిన గాయాలతో అపస్మారక స్థితిలో పడి ఉండటాన్ని స్థానికులు గుర్తించారు. 108 సిబ్బంది అక్కడికి చేరుకుని ప్రాథమిక చికిత్స అందించారు. ఆధార్ కార్డు ఆధారంగా నర్సింగాపూర్ తండాకు చెందిన యువతిగా గుర్తించి, మెరుగైన చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.




































