Dec 05, 2025, 05:12 IST/
వ్యక్తిని దారుణంగా హత్య చేసిన గుర్తు తెలియని దుండగులు
Dec 05, 2025, 05:12 IST
నిజామాబాద్ జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఆలూరు మండలంలో గంగారామ్ అనే వ్యక్తిని గుర్తుతెలియని దుండగులు హత్య చేశారు. గతంలో గంగారామ్ ఒక మహిళ హత్య కేసులో జైలుకు వెళ్లి వచ్చాడని స్థానికులు చెబుతున్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.