నారాయణపేట జిల్లా మక్తల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మొదటి సంవత్సరం డిగ్రీ కోర్సులలో ప్రవేశం పొందని విద్యార్థుల కోసం స్పాట్ అడ్మిషన్లు నిర్వహించబడుతున్నట్లు ప్రిన్సిపాల్ నారాయణ గౌడ్ తెలిపారు. ఇంటర్మీడియట్ లేదా తత్సమాన పరీక్షలలో ఉత్తీర్ణులై, ఇప్పటివరకు ఎలాంటి కాలేజీలో సీటు పొందని
విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ నెల 24, 25 తేదీలలో స్పాట్ అడ్మిషన్స్ పొందగలరని, ఆసక్తి గల
విద్యార్థులు వెంటనే మఖ్తల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలను సంప్రదించి, నేరుగా అడ్మిషన్ ప్రక్రియను పూర్తి చేసుకోవాలని సూచించారు.