నారాయణపేట జిల్లా కృష్ణ మండలం ఆలంపల్లి పాఠశాలలో స్కావెంజర్ గా పనిచేస్తున్న శరణప్ప సోమవారం అకాల మరణం చెందాడు. ఈ సందర్భంగా మండలంలోని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయుల బృందం తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ, ఎంఈఓ సూచనల మేరకు తమ వంతుగా విరాళాలు సేకరించి రూ. 51000/-ఆ కుటుంబానికి అందజేశారు. వారు మాట్లాడుతూ శరణప్ప కుటుంబానికి అండగా నిలవడం తమ వంతు బాధ్యత అని, వారి పిల్లల భవిష్యత్తుకు తమ వంతు సహకారం అందిస్తామని తెలిపారు. కార్యక్రమంలో అన్ని పాఠశాలల ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.