
రేపు ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ వెల్లడి
దేశంలోని ఐదు రాష్ట్రాలైన అస్సాం, కేరళ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఏప్రిల్ 29, బుధవారం సాయంత్రం 6:30 గంటల తర్వాత వెల్లడి కానున్నాయి. అధికారిక ఓట్ల లెక్కింపు, తుది ఫలితాలు మే 4, 2026 సోమవారం నాడు వెల్లడి కానున్నాయి. తమిళనాడులో డీఎంకే, అన్నాడీఎంకేలతో పాటు నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం కూడా పోటీలో ఉండటంతో అక్కడ ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది.




