నారాయణపేట జిల్లా మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం రైతుల పంటలు చివరి దశలో ఉన్నాయని, ఈ దశలో వారాబంధి పెట్టడమేంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. డ్యామ్ నిండా నీళ్లు ఉన్నప్పటికీ ఎందుకు కాలువలకు విడుదల చేయడం లేదని ప్రశ్నించారు. దాదాపు 20, 000 మంది రైతులు జూరాల నీటిపై ఆధార పడ్డారని, జూరాల కట్టిందే సాగునీటి కోసమని గుర్తు చేశారు. మేం నీళ్లు ఇవ్వము. రైతులకు నష్టం చేస్తాం అంటే మాత్రం ఊరుకునేది లేదని హెచ్చరించారు.