మాగనూర్: ఇంటిని ప్రారంభించిన జగన్నాథ రెడ్డి

57చూసినవారు
మాగనూర్: ఇంటిని ప్రారంభించిన జగన్నాథ రెడ్డి
మాగనూర్ మండలం అమ్మపల్లి గ్రామానికి చెందిన నరసమ్మ పూరీ గుడిసెలో వుంటుందని గ్రామస్తులు విజేఆర్ ఫౌండేషన్ అధినేత వర్కటం జగన్నాథ్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆయన సొంత నిధులు రూ. 3 లక్షలతో ఇంటిని నిర్మించి ఇచ్చారు. బుధవారం ఇంటిని ఆయన ప్రారంభించారు. అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. నరసమ్మ కుటుంబ సభ్యులు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు.