జిల్లా న్యాయ సేవ సంస్థ లీగల్ సర్వీసెస్ ఆధ్వర్యంలో సోమవారం మాగనూర్ మండలం వర్కూర్ గ్రామంలో ప్రజలకు అంబెడ్కర్ జీవిత చరిత్ర పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా పార లీగల్ వాలంటీర్ హాజమ్మ, నరసింహులు మాట్లాడుతూ.. పేద కుటుంబంలో జన్మించిన అంబెడ్కర్ స్వశక్తితో అంచెలంచెలుగా ఎదిగారు అని అన్నారు. కొలంబియా విశ్వవిద్యాలయం నుండి డాక్టరేట్ పట్టా అందుకున్నారని చెప్పారు. దేశానికి రాజ్యాంగాన్ని అందించారని అన్నారు.