
24 గంటల పీహెచ్సీకి అర్ధరాత్రి తాళం.. ఆసుపత్రి అరుగుపై ఆగిన గుండె
కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలం శరభవరానికి చెందిన ఇమంది మాణిక్యం(56) అనే వ్యక్తికి సోమవారం అర్ధరాత్రి దాటాక 3 గంటల సమయంలో గుండెనొప్పి రావడంతో, అతన్ని చేబ్రోలులోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అయితే, ఆసుపత్రికి తాళం వేసి ఉండటంతో, కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించేందుకు 108కు ఫోన్ చేసినా అంబులెన్స్ గంట వరకు రాలేదు. దీంతో మాణిక్యం అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ ఘటనపై విచారణ జరిపిన డీఎంహెచ్వో నరసింహనాయక్ వైద్య సిబ్బందికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు.




