మక్తల్: సీఎం సహాయ నిధి చెక్కులు అందించిన ఎమ్మెల్యే

85చూసినవారు
మక్తల్: సీఎం సహాయ నిధి చెక్కులు అందించిన ఎమ్మెల్యే
సీఎం సహాయ నిధి పేదలకు వరం లాంటిదని ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి అన్నారు. మక్తల్ పట్టణంలోని ఎమ్మెల్యే నివాసంలో శనివారం రుద్ర సముద్రం గ్రామానికి చెందిన మలిగేరి లింగమ్మకు రూ. 47 వేలు, జగదీశ్వరికి రూ. 18 వేలు, చిన్న కడుమూరు గ్రామానికి చెందిన రవికి రూ. 38 వేల విలువ గల సీఎం సహాయ నిధి చెక్కులను అందించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్