అర్ధరాత్రి షార్ట్ సర్క్యూట్ తో భారీ అగ్ని ప్రమాదం

23చూసినవారు
అర్ధరాత్రి షార్ట్ సర్క్యూట్ తో భారీ అగ్ని ప్రమాదం
మక్తల్ పట్టణంలోని కర్ని రోడ్డులో ఉన్న యజ్ఞం సామిల్‌లో అర్ధరాత్రి షార్ట్ సర్క్యూట్ కారణంగా భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ దుర్ఘటనలో సామిల్‌లోని కట్టెలు, యంత్రాలు కాలి బూడిదయ్యాయి. నూతన సంవత్సరం వేడుకల్లో ఉన్న యువకులు మంటలను గమనించి వెంటనే విద్యుత్ శాఖ, అగ్నిమాపక సిబ్బంది, పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు మంటలను అదుపులోకి తెచ్చారు. అమ్మకానికి ఉంచిన టేకుతో పాటు ఇతర విలువైన కట్టెలు కాలిపోవడంతో సుమారు రెండు లక్షల రూపాయల నష్టం వాటిల్లిందని బాధితుడు తెలిపారు.

సంబంధిత పోస్ట్