నారాయణపేట జిల్లా మక్తల్ మండలం గొలపల్లి గ్రామం నుండి మంతన్ గోడ్ వెళ్లే దారిలో వాగుపై నూతన వంతెన నిర్మాణానికి మంత్రి వాకిటి శ్రీహరి శంకుస్థాపన చేశారు. ఈ వంతెన నిర్మాణం కోటి యాభై లక్షల వ్యయంతో చేపట్టబడుతుందని, రోడ్లు అభివృద్ధి చెందితేనే గ్రామాలకు గౌరవం పెరుగుతుందని ఆయన అన్నారు. ఈ పనులు త్వరలోనే పూర్తవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక
కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.