విద్యుత్ శాఖ నూతన AEOకు సన్మానం

2చూసినవారు
విద్యుత్ శాఖ నూతన AEOకు సన్మానం
నారాయణపేట జిల్లా మక్తల్ విద్యుత్ శాఖ నూతన AEO గా విజయభాస్కర్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మక్తల్ విద్యుత్ శాఖ సిబ్బంది ఆయనను ఘనంగా సన్మానించి ఆహ్వానం పలికారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మక్తల్ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ నాణ్యమైన సేవలు అందించడానికి కృషి చేస్తానని పేర్కొన్నారు. కార్యక్రమంలో SE నవీన్ కుమార్, AD సత్యం, AE లు వెంకటేష్, ధర్మ తేజ, గంగాధర్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్