సరుకులు తరలించే వాహనాలలో సామాన్య ప్రజలు ప్రయాణిస్తున్నప్పటికీ అటు రవాణాశాఖ అధికారులు కానీ ఇటు స్థానిక పోలీసులకు కానీ కంటబడడం లేదు. నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణంలో ప్రతిరోజు కొన్ని పదుల సంఖ్యల
టాటా ఏసీ, బొలెరో మరియు మూడు టైర్ల ఆటోల వాహనాలలో ప్రయాణికులు కిక్కిరిసి ప్రయాణిస్తున్నప్పటికీ కనీసం ఒక్క కేసు కూడా నమోదు కాకపోవడం గమనార్హం. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మాత్రమే అధికారులు హడావుడి చేస్తారు తప్పితే ప్రమాదాలు రాకుండా ప్రయాణాలు నివారించడానికి ఎటువంటి చర్యలు చేపట్టడం లేదని విమర్శలు బాహాటంగానే వెల్లువెత్తుతున్నాయి.