Top 10 viral news 🔥

లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. ఇద్దరు మృతి
TG: జనగామ జిల్లా రఘునాథపాలెం మండలం నిడిగొండ వద్ద తెల్లవారుజామున మరో బస్సు ప్రమాదం జరిగింది. వరంగల్ - హైదరాబాద్ జాతీయ రహదారిపై ఆగి ఉన్న ఇసుక లారీని రాజధాని ఆర్టీసీ బస్సు వెనుక నుంచి ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా.. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. బస్సు హనుమకొండ నుంచి హైదరాబాద్ వస్తుండగా ఈ ఘటన జరిగింది. మృతలు ఒకరు HYD, మరొకరు హనుమకొండకు చెందిన వారిగా గుర్తించారు.




