పత్తికొనుగోళ్లలో రైతులకు అన్యాయం చేస్తే ఊరుకునేది లేదు.

2చూసినవారు
పత్తికొనుగోళ్లలో రైతులకు అన్యాయం చేస్తే ఊరుకునేది లేదు.
నారాయణపేట్ జిల్లా నర్వ మండలంలోని పాతర్చెడ్ గ్రామ శివారులో నూతనంగా ప్రారంభించిన కాటన్ మిల్లులో మార్కెట్ ధర కంటే తక్కువకు పత్తి కొనుగోలు చేస్తున్నారని రైతుల, మరియు సోషల్ మీడియాలో కథనాలకు వచ్చిన ఫిర్యాదుల మేరకు బీఆర్ఎస్ మండల అధ్యక్షులు మహేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం బీఆర్ఎస్ నాయకులు మిల్లును సందర్శించారు. క్వింటాలుకు 9, 200 ధర ఉండగా 8, 000కే కొనుగోలు చేయడం ఏంటని మిల్లు యాజమాన్యాన్ని ప్రశ్నించారు. రైతులకు న్యాయం జరిగేలా పత్తిని సరైన ధరకు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. రైతులకు అన్యాయం చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్