పాము కాటుతో మహిళ మృతి

4చూసినవారు
పాము కాటుతో మహిళ మృతి
నారాయణపేట జిల్లా నర్వ మండల కేంద్రానికి చెందిన గొల్ల మహేశ్వరి (23) పాముకాటుతో మృతి చెందింది. బుధవారం అర్ధరాత్రి ఏదో పురుగు కుట్టినట్లు అనిపించినా నిద్రలో ఉండడం వల్ల పట్టించుకోలేదు. తెల్లవారుజామున ఏదోల అవుతుందని కుటుంబ సభ్యులకు తెలపడంతో వారు వెంటనే నర్వ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడి నుండి మెరుగైన చికిత్స కోసం మహబూబ్ నగర్ తీసుకెళ్తుండగా మృతి చెందినట్లు బంధువులు తెలిపారు. భర్త రవి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై రమేష్ తెలిపారు.

సంబంధిత పోస్ట్