నాగర్ కర్నూల్ - Nagar Kurnool

వీడియోలు


నాగర్ కర్నూల్ జిల్లా
ఏఐ పెట్టుబడుల్లో భారత్‌కు 8వ స్థానం: ప్రపంచ ఆర్థిక ఫోరం
Feb 08, 2026, 11:02 IST/

ఏఐ పెట్టుబడుల్లో భారత్‌కు 8వ స్థానం: ప్రపంచ ఆర్థిక ఫోరం

Feb 08, 2026, 11:02 IST
కృత్రిమ మేధ (ఏఐ) రంగంలో ప్రపంచ దేశాల మధ్య పోటీ పెరుగుతున్న నేపథ్యంలో, పెట్టుబడుల పరంగా భారత్‌ 8వ స్థానంలో ఉందని వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరం వెల్లడించింది. 2010 నుంచి 2024 వరకు ఏఐలో అత్యధిక పెట్టుబడులు పెట్టిన 11 దేశాల జాబితాలో భారత్‌కు ఈ స్థానం దక్కింది. మరోవైపు, ఏఐ భారత ఆర్థిక వ్యవస్థకు భారీ ఊతమివ్వనుందని పీడబ్ల్యూసీ ఇండియా తెలిపింది. 2035 నాటికి ఏఐ వల్ల దేశ జీడీపీలోకి సుమారు రూ.50 లక్షల కోట్లు అదనంగా చేరే అవకాశం ఉందని అంచనా వేసింది. వచ్చే మూడేళ్లలో భారత్‌లో రూ.6.14 లక్షల కోట్లకుపైగా ఏఐ పెట్టుబడులు వాస్తవ రూపం దాల్చనున్నాయని వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరం అంచనా వేసింది.