రోడ్డు ప్రమాదంలో జిల్లాకు చెందిన యువకుడు మృతి

4చూసినవారు
రోడ్డు ప్రమాదంలో జిల్లాకు చెందిన యువకుడు మృతి
హైదరాబాద్ లో ఆర్టీసీ బస్సు ఢీకొని నాగర్ కర్నూల్ జిల్లా తిప్పారెడ్డిపల్లికి చెందిన కిషోర్(20) అనే ఇంజనీరింగ్ విద్యార్థి మృతి చెందగా, మరో యువతి గాయాలపాలైన ఘటన పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ పరిధిలో యన్నంపేట వంతెన పై శనివారం చోటుచేసుకుంది. బి.ఎన్. రెడ్డినగర్ లో నివాసముంటూ సెయింట్ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్నఅతను శనివారం తన బంధువైన విజయ అనే యువతిని పరీక్ష రాసేందుకు బైక్ పై తీసుకెళ్తుండగా ఈ ఘటన జరిగింది. క్షతగాత్రురాలిని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రి మార్చురీకి తరలించారు.

సంబంధిత పోస్ట్