అచ్చంపేట: నల్లమలలో పర్యాటకులకు కనువిందు చేసిన పులి

0చూసినవారు
నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గం అమ్రాబాద్ మండలం మన్ననూరు శివారులోని నల్లమల అడవుల్లో సఫారీకి వెళ్ళిన పర్యాటకులకు ఒక పెద్దపులి కనిపించింది. పర్యాటకులు తీసిన ఈ వీడియో శుక్రవారం సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇటీవల నల్లమల అడవుల్లో పులులు వరుసగా కనిపిస్తుండటంతో పర్యాటకుల సంఖ్య గణనీయంగా పెరిగింది. నల్లమల టైగర్ రిజర్వ్ లో పులుల సంఖ్య పెరగడంపై వన్యప్రాణి ప్రేమికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్