రాష్ట్ర సచివాలయంలో భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి ఆధ్వర్యంలో సోమవారం జరిగిన సాగునీటి ప్రాజెక్టులు, భూగర్భ జలాల ఉన్నత స్థాయి సమీక్ష సమావేశంలో అచ్చంపేట ఎమ్మెల్యే డా. చిక్కుడు వంశీకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా, అచ్చంపేట నియోజకవర్గానికి సాగునీటి ప్రాజెక్టుల ప్రాధాన్యత, సాగునీటి అవసరాలు, తాగునీటి సరఫరా, భవిష్యత్ కార్యాచరణపై మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఈ సమీక్షలో నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే కూచికుళ్ళ రాజేశ్ రెడ్డి, ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు.