అచ్చంపేట: ఆయాకు అంగన్వాడి టీచర్ ఇవ్వండి

82చూసినవారు
అచ్చంపేట: ఆయాకు అంగన్వాడి టీచర్ ఇవ్వండి
నాగర్ కర్నూల్ కలెక్టర్ కార్యాలయంలో సోమవారం జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజాసంఘాల నాయకులు కలెక్టర్ సంతోష్ కు వినతిపత్రం సమర్పించారు. అచ్చంపేట మండలం ఉప్పునుంతల మండలం లక్ష్మాపూర్ గ్రామంలో ఆయాకు అంగన్వాడి టీచర్ అయ్యేందుకు అన్ని అర్హతలు ఉన్న దళిత మహిళ అన్న కారణంతో పోస్టింగ్ ఇవ్వడం లేదని ప్రజాసంఘాల నాయకులు అన్నారు. ఇప్పటికైనా పోస్టింగ్ ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్ శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్