రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చేందుకు మంత్రివర్గం ఆమోదం తెలపడం పట్ల కాంగ్రెస్ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. అచ్చంపేట నియోజకవర్గం లింగాలలో శనివారం కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే వంశీకృష్ణల చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. సీఎంకు అనుకూలంగా నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు శ్రీశైలం, శివ, తదితరులు పాల్గొన్నారు.