అచ్చంపేట: ఉరుములతో ఓ మోస్తారు వర్షం

3చూసినవారు
మంగళవారం సాయంత్రం నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలోని వంగూరు మండలంలోని తిప్పారెడ్డిపల్లి, తిరుమలగిరి, గాజర, నిజాంబాద్, సర్వారెడ్డిపల్లి, కిష్టంపల్లి తదితర గ్రామాల్లో ఉరుములతో కూడిన ఓ మోస్తారు వర్షం కురిసింది. ఈ అకాల వర్షం వల్ల మామిడి తోటలకు తెగుళ్లు వ్యాపించే అవకాశం ఉందని, కోతకు వచ్చిన వరిపంట నేలరాలిపోయే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. వర్షం కారణంగా విద్యుత్ సరఫరాకు కూడా అంతరాయం కలిగింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్