నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గం అమ్రాబాద్ మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో బుధవారం ఫిజిక్స్ గెస్ట్ లెక్చరర్ తిరుపతయ్య గౌడ్ గుండెపోటుతో అకస్మాత్తుగా మృతి చెందారు. ఆయన మరణవార్తతో విద్యార్థులు, తోటి అధ్యాపకులు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం నిరంతరం శ్రమించే మంచి వ్యక్తిని కోల్పోయామని సహచర ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేశారు.