నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం మన్ననూరు గ్రామానికి చెందిన చెంచు కాళీ అనే యువకుడు బుధవారం కొబ్బరి చెట్టు ఎక్కి కాయలు కోస్తుండగా ప్రమాదవశాత్తు జారిపడి తలకు బలమైన గాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనపై ఎస్ఐ హనుమంత్ రెడ్డి బంధువుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.