నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గం అమ్రాబాద్ మండలం మన్ననూర్ ఐటిఐ కళాశాలలో నూతనంగా నిర్మించిన స్కిల్ డెవలప్మెంట్ కోర్స్ భవనాన్ని శనివారం ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ ప్రారంభించారు. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త స్కిల్ డెవలప్మెంట్ కోర్సుల వల్ల నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.