అచ్చంపేట నియోజకవర్గం వంగూరు మండలం కేంద్రంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి సోమవారం మండల అభివృద్ధి అధికారి జి. బ్రహ్మచారితో కలిసి ఎమ్మెల్యే డా. చిక్కుడు వంశీకృష్ణ భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రజా పాలనలో అర్హులకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామన్నారు. అనంతరం లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల ప్రొసీడింగ్ పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమాలలో మండల అధికారులు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.