ఆదివారం అచ్చంపేటలో జరిగిన బీఆర్ఎస్ జన గర్జన సభలో నాగర్ కర్నూల్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని నల్లమలకే పంపించాలని అన్నారు. ఆయన సొంత నియోజకవర్గం నుండే పతనం మొదలైందని, కాంగ్రెస్ పార్టీ పతనం అచ్చంపేట నుంచే ప్రారంభమైందని ఘాటుగా వ్యాఖ్యానించారు.